![]() |
![]() |

జయమ్ము నిశ్చయమ్మురా..జగపతి టాక్ షో ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కి రామ్ పండు వచ్చారు. ఆయన ఎవరో కాదు..ఆయన మాటను ఆయనే వినని ఆర్జీవీ. ఇక హోస్ట్ జగపతిబాబు ఐతే "రాంపండు" అంటూ స్టేజి మీదకు పిలిచేసారు. ఇక రావడమే శివ మూవీలో "బోటనీ పాఠముంది" సాంగ్ కి ఆర్జీవీ, జగపతి బాబు స్టెప్పులేశారు. అందరికీ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ..నాకు మాత్రం సైతాన్ అంటూ రామ్ గోపాల్ గురించి ముద్దుగా చెప్పుకున్నారు. "ప్రేక్షకుల కోసం సినిమా ఎప్పుడు తీస్తావ్" అని అడిగారు హోస్ట్. "సి నా లైఫ్ లో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎవడు ఎం చెప్పినా ఎవడు వినడు" అని చెప్పారు ఆర్జీవీ. "నీతో పది నిమిషాలు కూర్చుంటే నేను నువ్వైపోతాను" అని జగపతిబాబు చెప్పేసరికి కిసుక్కున నవ్వారు ఆర్జీవీ.
"నాకు తెలిసి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఇంకొకరు ఉన్నారు" అంటూ సందీప్ రెడ్డి వంగాని పిలిచారు. ఆయనకు వోడ్కా బాటిల్ ఇచ్చి మరీ వెల్కమ్ చేశారు జగపతి బాబు. దాంతో ఆర్జీవీ షాకయ్యారు. "ఏ నాకెందుకు ఇవ్వలేదు వోడ్కా...అంటే సందీప్ సూపర్ డైరెక్టర్ నేను కాదనా" అని సూటిగా అడిగేసారు ఆర్జీవీ. "సందీప్ ఫ్యాట్ మంటూ చెంప మీద కొట్టినట్టు మాట్లాడతాడు కదా ఫ్యాట్ ఫెల్లో ఎవడు అని అడిగాడు. ఐపోయింది ఇక 30 ఏళ్ళ నుంచి బిల్డ్ చేసిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక్క దెబ్బతో పోయింది" అని చెప్పుకొచ్చారు ఆర్జీవీ. "గర్ల్ ఫ్రెండ్ సంగతేంటి అది ఇంపార్టెంట్" అంటూ జగపతి బాబు అడిగేసరికి "మమ్మల్ని మేము ప్రేమించుకోవడానికే టైం లేనప్పుడు ఇంకా వేరే వాళ్ళ" అన్నారు ఆర్జీవీ. "కొన్ని సార్లు నేను మీ క్లాస్ మెట్ అయ్యుంటే ఎలా ఉండేది " అంటూ సందీప్ రెడ్డి వంగా ఆర్జీవీని ఒక కొంటె ప్రశ్న అడిగారు. "ఇద్దరిలో ఒకరు అమ్మాయి ఐతే" అంటూ ఆర్జీవీ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. " ఒక డెవిల్, ఒక యానిమల్ కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుతుంటే చాలా ముద్దుగా ఉంది" అని జగపతిబాబు కితాబిచ్చారు. ఎప్పుడూ లేనిది ఆర్జీవీ ఈ షోలో నవ్వుతూ కనిపించి ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చారు.
![]() |
![]() |